BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలన

Select Suryaa Now
ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలన

 

ఉల్లిభద్రలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం పరిశీలన

ఎంపీడీవో కార్యాలయం ఏవో నాలి అర్జునరావు

గరుగుబిల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్:రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మేరకు,గరుగు బిల్లి మండలంలో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ మైంది.ఈనేపథ్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఏవో నాలి అర్జునరావు మండలంలోని ఉల్లిభద్ర, గొట్టివలస తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మంగళ వారం పరిశీలించారు.నామినేషన్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మరియు ప్రతిపాద కులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా అధికారులు చేసిన ఏర్పాట్లను ఎంపీడీవో స్వయంగా తనిఖీ చేశారు. తాగునీరు, నీడ వసతి, సహాయ కేంద్రాల (హెల్ప్ డెస్క్) పని తీరును అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ ప్రక్రియ పారదర్శకంగా, త్వరిత గతిన పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఎంపీడీవో కార్యాలయం ఏవో నాలి అర్జునరావు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు విషయంలో సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని ఏవో అర్జునరావు పేర్కొన్నారు.నామినేషన్ కేంద్రం పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అభ్యర్థులు, వారి అనుచరులు గుంపులుగా చేరకుండా చూడాలని స్పష్టం చేశారు.అభ్యర్థితోపాటు నిబంధనల ప్రకారం అనుమతించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమ తించాలని తెలియజేశారు.తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినే షన్లను స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులకు తెలియజేశా రు.బుధవారం నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈపరిశీలనలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.