BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

మరుపెంట సర్పంచ్ బరిలో ఉడమల పార్వతమ్మ!

Select Suryaa Now
మరుపెంట సర్పంచ్ బరిలో ఉడమల పార్వతమ్మ!

 

ఉడమల సత్యనారాయణ సతీమణి నామినేషన్ దాఖలు

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని వెల్లడి

భారీ సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు

గరుగుబిల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్:మండల పరిధిలోని మరుపెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్న ఉడమల పార్వతమ్మ గ్రామాభి వృద్ధే ప్రధాన లక్ష్యంగా మద్దతుదారు లు,గ్రామస్తులతో కలిసి గొట్టివలస గ్రామంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాల ను సమర్పించారు.ఈమేరకు మరు పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉడమల సత్యనారాయణ సతీమణి ఉడమల పార్వతమ్మ తన నామినేషన్‌ను దాఖలు చేశారు.ఈ సందర్భంగా మరుపెంట గ్రామ పంచా యతీ పరిధిలోని మరుపెంట,సాంబన్న వలస, తులసిరామినాయుడువలస గ్రామాలకు చెందిన మద్దతుదారులు, అభిమానులు మరియు గ్రామ పెద్దలతో కలిసి సర్పంచ్ అభ్యర్థి ఉడమల పార్వ తమ్మ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మరుపెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఉడమల పార్వతమ్మ, ఉడమల సత్యనారాయణలు మాట్లా డుతూ మరుపెంట గ్రామ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ తమను ఆశీర్వదించి, రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో గ్రామంలోని పలువురు ముఖ్య నాయకులు, యువకులు, మహిళలు మరియు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు