BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

ఘాట్ రోడ్లో అదుపుతప్పి కొండను ఢీకొట్టిన కంటైనర్

Select Suryaa Now
ఘాట్ రోడ్లో అదుపుతప్పి కొండను ఢీకొట్టిన కంటైనర్

 

-ఒకరు మృతి.. ఇద్దరుకు గాయాలు ,

పాచిపెంట, నవంబర్ 17, మేజర్ న్యూస్:

కంటైనర్ లారీ ఘాట్ రోడ్లో అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాల పాలయ్యారు. పాచిపెంట ఎస్ ఐ లాలం అర్జున్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారు జామున సుమారు నాలుగు గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఒక కంటైనర్ లారీ ఘాట్ రోడ్డులో పీ కోనవలస చెక్‌పోస్టుకు సుమారు ఒక కిలోమీటరు దూరంలో అదుపుతప్పి కొండను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ (45 ) మృతి చెందారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అదేవిధంగా, ప్రమాదానికి గురైన కంటైనర్ లారీని బయటకు తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో, అక్కడ నిలిపి ఉంచిన ఒడిశా రాష్ట్రం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును, ఒడిశా నుండి బొబ్బిలి వైపు వెళ్తున్న మరో లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనుక నుండి ఢీకొట్టింది. ఈ రెండవ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.”
ఈ రెండు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టడం జరుగుతోందని ఎస్సై అర్జున్ తెలిపారు.