BREAKING
మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం! జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం

అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం

Select Suryaa Now
అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం

అమలాపురం మేజర్ న్యూస్* *అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం*
- ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి

• 12 జిల్లాల్లో 703 ప్రత్యేక బృందాలు.. 8,161 మంది సిబ్బంది సిద్ధం
• 24,400 విద్యుత్ స్తంభాలు, 1,848 ట్రాన్స్‌ఫార్మర్లు, 4వేల కిలోమీటర్లకు పైగా విద్యుత్ తీగలు అందుబాటులో
• విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
• అత్యవసర సేవలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు

అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అన్ని ముందస్తు ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. తుపాను సన్నద్ధతలో భాగంగా సోమవారం  టెలీకాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు, సీజీఎం లు, సంస్థ పరిధిలోని 12 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందుగానే అవసరమైన సిబ్బంది, వాహనాలు, విద్యుత్ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
సంస్థ పరిధిలోని 12 జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ కోసం మొత్తం 703 బృందాలను, 8,161 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు 332 డీజిల్ జనరేటర్లు, 100 వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్లు, 427 వాహనాలు, 41 కంట్రోల్ రూమ్‌లు, 753 పవర్ సా మెషిన్లు, 371 పోల్ డ్రిల్లింగ్ మెషిన్లు, 306 క్రేన్లు, 179 జేసీబీలను అందుబాటులో ఉంచారు.
అదేవిధంగా, విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన సామగ్రిలో భాగంగా 24,400 విద్యుత్ స్తంభాలు, 1,848 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, సుమారు 4వేల కిలోమీటర్లకు అవసరమైన వివిధ రకాల విద్యుత్ కండక్టర్లను సిద్ధంగా ఉంచారు. అదనపు సామగ్రి, సిబ్బంది సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, సబ్‌స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు జరిగిన నష్టంపై గంటగంటకూ నివేదికలు సేకరించి జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, అత్యవసర సేవల కేంద్రాలు, టెలికాం టవర్లు, విపత్తు నిర్వహణ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. సబ్‌స్టేషన్లలోకి వర్షపు నీరు చేరకుండా, నీరు చేరిన చోట తక్షణమే తొలగించేందుకు పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొనే సిబ్బంది భద్రతకు హెల్మెట్లు, హ్యాండ్ గ్లౌజులు, రెయిన్‌కోట్లు, గమ్‌బూట్లు తదితర రక్షణ పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
తుపాను సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, లైన్లపై పడిన చెట్ల కొమ్మల సమీపానికి వెళ్లరాదని వినియోగదారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులపై సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు.      రంబాల సత్యనారాయణ అమలాపురం