మచిలీపట్నం నూతన మేయర్ అబ్దుల్ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు
మచిలీపట్నం, మేజర్ న్యూస్: మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్డీఏ కూటమి తరఫున ఘన విజయం సాధించిన అబ్దుల్ అబీదా, హసీం బేగ్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అబీదాకు ఎంపీ బాలశౌరి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మచిలీపట్నం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, నగర అభివృద్ధి కార్యక్రమాల్లో నూతన మేయర్ చురుకైన పాత్ర పోషించాలని ఎంపీ బాలశౌరి ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.