BREAKING
12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం 23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా తాడిగడప 26వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం డయల్‌ 112కు కాల్‌.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం!

ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం ప్రాంగణంలో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం అజిత్‌సింగ్ నగర్‌లోని తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో పెట్టేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు నవంబర్ 26న జరిగే వేడుకల్లో బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం కేవలం వేడుకకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, బాధ్యతలపై చైతన్యం కల్పించే కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, వేడుకల నిర్వాహకులు బెజ్జం జయపాల్, మద్దాల చక్రవర్తి, దళితరత్న పరీశపోగు రాజేష్, వేల్పుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.