BREAKING
ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు.. దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్. అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం 23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు

Select Suryaa Now
23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు

మచిలీపట్నం, మేజర్ న్యూస్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3న నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 23న కృష్ణాజిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయి. 13 ఏళ్లు పైబడిన విభిన్న ప్రతిభావంతులైన బాలురు, బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చు. విజువల్లీ ఇంపెయిర్డ్ (దృష్టిలోపం), ఇంటలెక్చువల్లీ ఇంపెయిర్డ్ (మేధో వైకల్యం), ఫిజికల్లీ ఇంపెయిర్డ్ (శారీరక వైకల్యం), ఆటిజం విభాగాల్లో ఆరు క్రీడాంశాలైన పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, పారా టేబుల్ టెన్నిస్‌లలో ఎంపికలు నిర్వహిస్తారు. దివ్యాంగ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పించడం ఈ ఎంపికల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి ఎంపికలు, పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల కృష్ణాజిల్లా క్రీడాకారులు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, సదరం లేదా యూడీఐడీ వైకల్య ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 23న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ నవంబర్ 17న విడుదల చేశారు. మరిన్ని వివరాలకు 9553868505, 9000013613, 9494876657 నంబర్లను సంప్రదించాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన వాడ్రేవు కామరాజు తెలిపారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.