శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.