కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం రాత్రి ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజా క్రతువులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సరిత, పద్మావతి ఠాకూర్, కళావతి తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.