BREAKING
జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు.. దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్. అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి

రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్

Select Suryaa Now
రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్

విజయవాడ మేజర్ న్యూస్ : పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు తదుపరి తరానికి సంపదను వారసత్వంగా అందించేందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్ ఆధారిత రాబడులతో రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేలా రూపొందించిన ఈ పథకంలో 90 ఏళ్ల వరకు వెస్టింగ్ వయస్సు అవకాశం ఉంది. 40 ఏళ్ల వయస్సు నుంచే రిటైర్మెంట్ ప్రణాళిక ప్రారంభించవచ్చు. పాలసీ మెచ్యూరిటీ సమయంలో పోగైన నిధిలో 60 శాతం వరకు పన్ను నిబంధనలకు లోబడి ఏకమొత్తంగా పొందవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేసి పదవీ విరమణ అనంతరం ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో వివిధ ఫండ్ ఎంపికలు, 100 శాతం వరకు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశం, ప్రీమియం చెల్లింపులో వెసులుబాటు ఉన్నాయి. ఐదేళ్ల లాక్ఇన్ పూర్తయిన తర్వాత నిబంధనలకు లోబడి ఫండ్ విలువలో 25 శాతం వరకు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. చెల్లించిన ప్రీమియంలు లేదా ఫండ్ విలువలో అధికమైన మొత్తానికి 105 శాతం డెత్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఫ్యామిలీ సెక్యూర్ ఆప్షన్ ద్వారా జాయింట్ లైఫ్ కవరేజీ సదుపాయం కల్పించారు..
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.