దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్.
*అమలాపురం మేజర్ న్యూస్** దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్.
కోనసీమ సహా పలు జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు....
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. కోనసీమకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న అంచనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే ‘అక్వాన్’ తుఫాన్ రూపంలో మరో వాతావరణ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. తుఫాన్ తీవ్రత పెరిగితే భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా. ఈ నెల 19వ తేదీ రాత్రికి లేదా 20వ తేదీ మధ్యాహ్నానికి అక్వాన్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే తుఫాన్ గమనం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉంది.* తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారుల నుంచి వెలువడే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు. రంబాల సత్యనారాయణ అమలాపురం *