BREAKING
అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు.. దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్. అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి

అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: అక్వాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశించారు. మంగళవారం సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల సమయంలో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తుఫాన్‌పై అవగాహన కల్పించి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలని, నగరపాలక సంస్థ కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.