శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన పాఠశాల విద్యార్థులు ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిపై భక్తితో వచ్చిన చిన్నారులకు దేవస్థానం ఈవో శీనా నాయక్ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఉచిత దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.