BREAKING
ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు.. దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాన్. అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న పాఠశాల విద్యార్థులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్ రిటైర్మెంట్‌తో పాటు వారసత్వ సంపద సృష్టికి ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం 23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం

Select Suryaa Now
ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి రజత పతకం సాధించి విజయవాడ నగరానికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు విజయ్ గోగులమూడిని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఘనంగా సన్మానించి అభినందించారు. నవంబర్ 10 నుంచి 17వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాలో నిర్వహించిన ఆసియా స్థాయి లేజర్ రన్ పోటీల్లో విజయ్ గోగులమూడి ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించడం అభినందనీయమని బొండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి, విజయవాడ నగరానికి మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. యువత విజయ్ గోగులమూడిని ఆదర్శంగా తీసుకుని క్రీడారంగంలో రాణించాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 83వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ పైడి శ్రీను, వైస్ ప్రెసిడెంట్ పోకతోట శివకృష్ణ, న్యాయవాదులు షేక్ నసీమ్, జనగాం మల్లేశ్వరి, టీడీపీ నాయకులు పోకతోట దుర్గారావు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.