నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన
గన్నవరం, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లాలో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని స్థానిక సంస్థల ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి. అభిషేక్ ఐఏఎస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల విధుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అధికారులు చేపట్టిన ఏర్పాట్ల పట్ల జనరల్ అబ్జర్వర్ వి. అభిషేక్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎంపీడీవో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.