BREAKING
12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి 12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి ఆసియా క్రీడల్లో రజత పతక విజేత విజయ్ గోగులమూడికి ఘన సన్మానం 23న జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నామినేషన్ కేంద్రం ఏర్పాట్లపై జనరల్ అబ్జర్వర్ పరిశీలన అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా తాడిగడప 26వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం డయల్‌ 112కు కాల్‌.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం!

మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు

Select Suryaa Now
మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు

మచిలీపట్నం, మేజర్ న్యూస్: మచిలీపట్నం నగర నూతన మేయర్‌గా విజయం సాధించిన అబ్దుల్‌ అబీదా, డా. హాసీమ్‌ బేగ్‌లకు నగరంలోని పలు ప్రాంతాల్లో అభినందనలు, సన్మానాలు వెల్లువెత్తాయి. నగరంలోని సర్కిల్‌పేటలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బాబా ప్రసాద్‌, పంతం గజేంద్ర దంపతులు, కార్పొరేటర్‌ కట్ట అంజిబాబు, బొడ్డు శీను, అన్నం ఆనంద్‌, టీవీ ఫణికుమార్‌, గుణ్ణం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని 60వ డివిజన్‌కు చెందిన డ్వాక్రా గ్రూపుల ప్రతినిధులు, ఆర్పీలు అబ్దుల్‌ అబీదా, డా. హాసీమ్‌ బేగ్‌లను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బాబా ప్రసాద్‌, డ్వాక్రా గ్రూపుల సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు మచిలీపట్నం 57వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి వేముల బుజ్జి వారిని కలిసి మేయర్‌గా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ నాయకుడు షేక్‌ ఆసిఫ్‌ పాషా ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కూడా మేయర్‌ అబ్దుల్‌ అబీదా, డా. హాసీమ్‌ బేగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసిఫ్‌ పాషా వారిని ఘనంగా సత్కరించారు. నగర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.