గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా
గుడివాడ, మేజర్ న్యూస్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన గుడివాడలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ముగ్గు బజార్ సెంటర్, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్డులోని రెడ్సన్ ఫౌండేషన్ డీడీయూజీకేవై శిక్షణ కేంద్రంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. యాక్సిస్ బ్యాంక్, హెటెరో ల్యాబ్స్, వరుణ్ మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జెడ్‌ఎఫ్ కమర్షియల్ ఇండియా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, అపోలో ఫార్మసీ, టాటా ఎలక్ట్రానిక్స్, బ్లూస్టార్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. మొత్తం 400కు పైగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి. నరేష్‌కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి మంచి వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inవెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు రెజ్యూమ్, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 19682, 84648 53703, 95732 78755 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.