BREAKING
నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా తాడిగడప 26వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం డయల్‌ 112కు కాల్‌.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం! జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు!

విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు

Select Suryaa Now
విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా..   రాజకీయాలకు సంబంధం లేదు

విజయవాడ మేజర్ న్యూస్: విజయా డెయిరీలో జరిగిన అవినీతి, అక్రమాలపై తాను కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నానని, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ సీనియర్ నేత, పెనమకురు పాలకవర్గ కేంద్ర అధ్యక్షులు, తోట్లవల్లూరు మండల ఎంపీపీ శివరామ్ స్పష్టం చేశారు. శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2022, 2023 సంవత్సరాల్లో తన నామినేషన్లను అన్యాయంగా డిస్క్వాలిఫై చేయడంపై ట్రిబ్యునల్, హైకోర్టులో న్యాయపోరాటం చేశానన్నారు. తాజాగా కోర్టు ఐదుగురు డైరెక్టర్లను డిస్క్వాలిఫై చేస్తూ తీర్పు ఇచ్చిందని తెలిపారు. చలసాని ఆంజనేయులు హయాంలో విజయవాడ డెయిరీలో రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. తనను బోర్డులోకి రాకుండా అడ్డుకునేందుకు రైతుల సొమ్మును కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారని, న్యాయపోరాటం కోసం కుటుంబ ఆస్తులు, పొలాలు సైతం అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ రాజకీయాలతో ముడిపెట్టవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు కాకాని శ్రీనివాస్, యలమంచి శ్రీధర్, పామర్తి శివ, మరీదు పరశురామ్ పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.