BREAKING
నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా తాడిగడప 26వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం డయల్‌ 112కు కాల్‌.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం! జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు!

జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం

Select Suryaa Now
జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం

తాడిగడప, మేజర్ న్యూస్: జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో కానూరు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నాలుగో సంవత్సరం విద్యార్థి లక్ష్యదీప్ రజత పతకం సాధించారు. నవంబర్ 14, 15 తేదీల్లో గుడ్లవల్లేరులోని ఎస్.ఆర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల 59 కిలోల విభాగంలో పాల్గొన్న లక్ష్యదీప్ మొత్తం 342.5 కిలోల బరువును ఎత్తి ప్రతిభ కనబరిచారు. ఇందులో స్క్వాట్‌లో 110 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 87.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 145 కిలోలు ఎత్తారు. ఈ విజయంపై సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు ఎం. రాజయ్య, కార్యదర్శి పి. లక్ష్మణరావు, కోశాధికారి ఎస్. వెంకటేశ్వరరావు, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ డా. పి. వెంకటేశ్వరరావు, ప్రో వైస్ ఛాన్సలర్ డా. ఎ.వి. రత్న ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. రవిచంద్, ఫిజికల్ డైరెక్టర్లు పి. రఘు, లక్ష్మీ సౌజన్య అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.