మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
పిబి శ్రీనివాసరావు మా దగ్గర మాజీ మేనేజరు మాత్రమే
(సాలూరు జమిందారు విక్రమ్ చంద్ర సన్యాసి రాజు)
మేజర్ న్యూస్ సాలూరు నవంబరు 17
పిబి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో మా దగ్గర మేనేజరుగా పని చేసినంత మాత్రాన మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని సాలూరు జమిందారు విక్రమ చంద్ర సన్యాసి రాజు పత్రికా ముఖంగా హెచ్చరించారు.మంగ్లవారం జమిందారు కోటలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు అనారోగ్యం కారణంగా మా దగ్గర మేనేజరుగా పని చేస్తున్న పిబి శ్రీనివాసరావుకు మా ఆస్తుల విషయమై పవర్ ఆఫ్ అటార్నీ అప్పజెప్పామన్నారు. మేము ఇచ్చిన అధికారాన్ని పిబి శ్రీనివాసరావు దుర్వినియోగం చేస్తూ ప్రజలతో పాటు, అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న విషయం తన దృష్టికి రావడంతో 2020 లోనే అతనికి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని రద్దుచేసామన్నారు.
సాలూరులో వున్న మా ఆస్తులతో మా జమిందారి వారసులకు మాత్రమే క్రయ విక్రయాలకు పూర్తి హక్కులు ఉంటాయే తప్పా అన్యులకు హక్కులు వుండవని ఈ సందర్భంగా సాలూరు ప్రజలకు తెలియజేసారు. ఒకవేళ మా ఆస్తుల విషయంలో జమిందారి ఫౌండర్ నని పిబి శ్రీనివాసరావు జోక్యం కల్పించుకునేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలియజేశారు.