BREAKING
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు చినబోగిల సర్పంచ్‌గా మర్రాపు శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం!

వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి.

Select Suryaa Now
వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి.

 

కశింకోట(అనకాపల్లి), నవంబర్ 17, మేజర్ న్యూస్: స్థానిక కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని జి. భీమవరం గ్రామంలో వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి బత్తిన రాజారావు (33) అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 16వ తేదీన రాత్రి సుమారు 8.00 గంటల సమయంలో జి. భీమవరం గ్రామానికి చెందిన బత్తిన రాజారావు, తన వృత్తిలో భాగంగా గ్రామంలోని తురకలపూడి చేలో ఉన్న షెడ్డులో వెల్డింగ్ పని చేసేందుకు గొంతున శ్రీను, పాతాళ నాగశ్రీను అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో రాజారావు వెల్డింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేయగానే అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడే ఉన్న గొంతున శ్రీను, పాతాళ నాగశ్రీను ఇద్దరూ విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, రాజారావును అందుబాటులో ఉన్న వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సమయానికి రాజారావు మృతి చెందినట్లు విధుల్లో ఉన్న వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుని భార్య బత్తిన అరుణ (24) కశింకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త విద్యుత్ షాక్ తగలడం వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందారని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనకు సంబంధించిన వివరాలపై సిఐ అల్లు స్వామి నాయుడు పర్యవేక్షణలో తదుపరి చట్టపరమైన దర్యాప్తు చేపడుతున్నామని కసింకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కేసు దర్యాప్తు అధికారి కె. లక్ష్మణరావు, తెలిపారు.