1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు
రామాయంపేట ; రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ నూతనంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మ నవనీత గణేష్, పట్టణ అధ్యక్షులు చింతల స్వప్న స్వామి, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, పుట్టి సందీప్, దేవుని రంజిత్, డాకి శ్యామల స్వామి, కోఆప్షన్ సభ్యులు చింతల రాధా భవాని యాదగిరి, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ ఒద్ది స్వామి, ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరం శంకర్, భాస్కర్, బొట్ల బాబు, కుందన అశోక్, సిద్ధ రాములు, శీను, సురేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.