రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
రామాయంపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం అర్హులైన నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణానికి చెందిన 142 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనానికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ పోచమ్మ నవనీత గణేష్, మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.