మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి రాయల్, జనసేన పార్టీ నగర కార్యదర్శి వల్లంశెట్టి రమణ లు మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపురం ఎంపీటీసీగా విజయం సాధించిన సందర్భంగా లాల్ స్వామి రాయల్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందిస్తూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనకు ఎంపీటీసీగా అవకాశం కల్పించినందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ కు లాల్ స్వామి కృతజ్ఞతలు తెలుపుతూ.. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..