BREAKING
ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య.

Select Suryaa Now
కన్నతల్లిని కడతేర్చిన కొడుకు  రోకలిబండతో తలపై బాది దారుణ హత్య.

పెద్దశంకరంపేట ; డబ్బుల విషయంలో కుటుంబంలో తలెత్తిన వివాదం విషాదానికి దారితీసింది. క్షణికావేశంలో కన్నతల్లిపైనే కొడుకు రోకలిబండతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన పెద్దశంకరంపేట మండలం శివాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చిలకముక్కు పాపయ్య నూతన ఇల్లు నిర్మించుకునే క్రమంలో డబ్బుల విషయమై సోమవారం రాత్రి తన తల్లి పద్మమ్మ (73)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పాపయ్య రోకలిబండతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి అక్క కొడుకు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.