BREAKING
విదేశీ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి మల్లంగుంట టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా పార్లపల్లి మునికృష్ణారెడ్డి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తుళ్లూరిని కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి రాయల్ గుమ్మగట్ట పీఠం కోసం బరిలోకి కె ఎం రాజు - వైయస్సార్ సిపి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్! వెంకన్నలయానికి కార్తీక్ శోభ అలంకార ప్రియునికి విరులమాల.. పుష్పయాగంతో పులకించిన తిరుమల! సోములదొడ్డి సర్పంచ్ అభ్యర్థిగా కూటమి మద్దతుదారుడు కలిమిశెట్టి శ్రీనివాసులు నామినేషన్ వాలంటీర్లు సేవలందించాలి విదేశీ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంబించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు. : ప్లీజ్ సాయంత్రం ఆపండి రెండు బైకులను ఢీ కొట్టిన ఇసుక లారీ, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు ముగిసిన నామినేషన్లు పర్వం

ముగిసిన నామినేషన్లు పర్వం

Select Suryaa Now
ముగిసిన నామినేషన్లు పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం..

3 రోజులు.. 635 నామినేషన్లు

* రాజమహేంద్రవరం మేయర్ స్థానానికి చివరి రోజు 23 నామినేషన్లు

* 72 డివిజన్లకు వార్డు సభ్యులుగా 512 దాఖలు

* మూడు రోజుల్లో మొత్తం 635 నామినేషన్లు నమోదు

* టీడీపీ నుంచి అత్యధికంగా 166 నామినేషన్లు

* స్వతంత్ర అభ్యర్థుల ను

నేటి దినపత్రిక సూర్య బ్యూరో 

రాజమహేంద్రవరం, నవంబరు 16: 

నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ పదవికి 23 నామినేషన్లు, 72 డివిజన్లలో వార్డు సభ్యుల స్థానాలకు 512 నామినేషన్లు అందినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. తొలి రెండు రోజుల్లో నమోదైన 100 నామినేషన్లతో కలిపి మూడు రోజుల్లో మొత్తం 635 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని కమిషనర్ పేర్కొన్నారు. గడువు ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

పార్టీల వారీగా చివరి రోజు నామినేషన్లు:

సోమవారం చివరి రోజు దాఖలైన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ నుంచి 166, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 130, జనసేన నుంచి 43, బీజేపీ నుంచి 22, బీఎస్పీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 19, సీపీఐ నుంచి 3, సీపీఐ(ఎం) నుంచి 1, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 136 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన సాధారణ పరిశీలకురాలు:

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎం. గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ పదవికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఎన్నికల విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలకురాలికి వివరించారు. తొలి రెండు రోజుల్లో మొత్తం 100 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో మేయర్ పదవికి రెండు నామినేషన్లు అందినట్లు తెలిపారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాల స్వీకరణ తీరును, అధికారులు నిర్వహిస్తున్న విధులను గౌతమి నిశితంగా పరిశీలించారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పత్రాల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం సరిచేసుకునేందుకు తగిన సూచనలు అందించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. 

మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అభ్యర్థుల ఉపసంహరణపై రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 19న ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.