ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ
*ఎంపీ చామల కుటుంబాన్ని పరామర్శించిన బాలు నాయక్*
*నివాళులర్పించి.. కుటుంబానికి సానుభూతి*
దేవరకొండ ప్రతినిధి నవంబర్ 16:( మేజర్ న్యూస్ )
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అండగా నిలిచారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ శ్రీమతి చామల రంగనాయకమ్మ దశదిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై, ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.శాలిగౌరారం మండల కేంద్రంలోని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత చామల రంగనాయకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా దివంగత చామల రంగనాయకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ వెంట డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు