BREAKING
భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు

క్రోసూరులో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.

Select Suryaa Now
 క్రోసూరులో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.
 క్రోసూరు న్యూస్  :  59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవా‌లలో‌ భాగంగా క్రోసూరు గ్రంధాలయంలో మూడవరోజు గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి. వెంకట రమణయ్య , పాతూరి. నాగభూషణం, మరియు ఎస్సార్. రంగనాథన్, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హిందీ పండిట్, ఎస్ఎం. సుభాని, పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కృషి పట్టుదల అవసరమని తెలిపారు. అలాగే విద్యార్థులు ‌లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన అర్హతలను గురించి వివరించారు. అనంతరం గ్రంథాలయ అధికారి వై. వీరాంజమ్మ మాట్లాడుతూ‌ గ్రంథాలయాలు విజ్ఞాన బండారాలని వాటిని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ‌ స్వతంత్ర ఉద్యమ నాయకులు చిత్రాలను మరియు ప్రకృతి దృశ్యాలకు సంబంధించిన చిత్రలేఖను పోటీలు ‌ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు షేక్. హసన్ మరియు గ్రంథాలయ పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.