మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం....
విజయనగరం, సూర్య: విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించడం వలన కలిగే ఆరోగ్యపరమైన, సామాజిక దుష్ప్రభావాలు, వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలు మరియు వాటిని ఉల్లంఘించిన వారికి విధించే శిక్షల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ , కళాశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం వన్ టౌన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె. మన్మధరావు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.