విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం..
న్యూఢిల్లీ: తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకునేందుకు మొదట్లో ఎంతో సంకోచించానని, అయితే తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒత్తిడి చేయడం వల్లే ఆత్మకథ రాయడానికి ముందుకు వచ్చానని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భావోద్వేగంగా తెలిపారు. తన ఆత్మకథ ‘బిలాంగింగ్’ (Belonging) పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె తన జీవితంలోని ఆటుపోట్లు, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
గతంలోని విషాదాలను మళ్లీ గుర్తు చేసుకుని అక్షర రూపంలో పెట్టడం తనకు చాలా కష్టంగా అనిపించిందని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. "నేను వేరే దేశం నుంచి భారత్‌కు వచ్చాను. అయితే, పెద్దలను గౌరవించడం అనేది నా పెంపకంలోనే ఉంది. ఇక్కడి సంస్కృతి, విలువలను ఎప్పుడూ గౌరవించాను" అని ఆమె పేర్కొన్నారు.
రాజకీయ జీవితంలో తన కుటుంబంపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని సోనియా గాంధీ వాపోయారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డానని, తన ప్రయాణంలోని వాస్తవాలను ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాసినట్లు ఆమె వివరించారు.