డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం
--క్రిమిసంహారక మందు పూసిన దోమతెరలను పంపిణి చేసిన అధికారులు
అమరాపురం మేజర్ న్యూస్ నవంబరు 16: వైద్యాధికారి డాక్టర్ అంబరీష్, నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా క్రిమిసంహారక మందు పూసిన దోమతెరలను పంపిణి ఎంపీడీవో రామారావు మరియు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ షమీఉల్లా ఆధ్వర్యంలో అమరాపురం మండలం లోని హలుకురు గ్రామంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల లోని విద్యార్థులకు నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా క్రిమిసంహారక మందు పూసిన దోమతెరలను పంపిణి చేయడం జరిగింది. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ మరియు చికున్ గన్య లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఈ దోమతెరలు పంచడం జరిగింది. సాధారణ దోమతెరలకు భిన్నంగా, ఈ తెరల దారాలలోనే ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనం (పైరెథ్రాయిడ్) కలిపి తయారు చేస్తారు. దీనివల్ల దోమలు తెరపై వాలినప్పుడు అవి చనిపోతాయి లేదా దూరంగా పారిపోతాయి. వీటిని కనీసం 20 సార్లు ఉతికినప్పటికీ లేదా సుమారు 3 సంవత్సరాల వరకు వీటిలోని ఔషధ ప్రభావం తగ్గకుండా పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ షమీఉల్లా మాట్లడుతూ ఈ దోమతెరలను తక్షణమే ఉపయోగించకుండా రెండురోజులు నీడలో ఆరబెట్టిన తర్వాత ఉపయోగించవలయునని తెలియజేయడం జరిగింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ గురుకులం లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి పిల్లలతో పాటు భోజనం చేసి సంతృప్తిని వ్యక్త పరిచారు మరియు కిచెన్ గార్డెన్ ను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ షమీఉల్లా వైద్యాధికారి అంబరీష్, ఎంపీడీవో రామారావు గురుకుల పాటశ్యాల ప్రిన్సిపాల్ టి.వి.అపర్ణ ఆరోగ్యకార్యకర్త మనోహర్ మరియు ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.