BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: కర్ణాటకపై ఉత్తరప్రదేశ్ ఘన విజయం.. సీజన్‌లో తొలి గెలుపు నమోదు! న్యూజిలాండ్‌తో పోరులో భారత్‌కు ఊరట.. బౌలర్ల ప్రదర్శనే ప్రధాన బలం! కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం

గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి

Select Suryaa Now
గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి
  • పంచాయితీ ల ఏకగ్రీవాలకు ఎత్తులు పై ఎత్తులు 
    పూసపాటిరేగ, సూర్య: గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. చాలా పంచాయితీల్లో ఏకగ్రీవాలకు శతవిధాలుగా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పూసపాటి పాలెం పంచాయతీలో గతంలో మూడుసార్లు సర్పంచ్ పదవులను అనుభవించిన రైతు సత్యం ఈసారి కూడా పదవిని తన సొంతం చేసుకునేందుకు గ్రామ పెద్దలు అందరూ కలిసి వేలంపాట ద్వారా రూ.20 లక్షలకు పదవిని కైవసో చేసుకోగా, అదే బాటలో మరికొన్ని పంచాయితీలు పదవులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం  చేస్తూనే ఉన్నారు. కోనాడ పంచాయతీలో గతంలో కోనాడ సర్పంచ్ గా పనిచేసిన దంగా భూలోక గ్రామ పెద్దలతో కలిసి పూసపాటిరేగ సమీపంలో వేలంపాట ఆదివారం నిర్వహించారు. ఈ వేలం పాట ద్వారా వైకాపా తో పాటు జనసేన కు చెందినవారు రూ. 55 లక్షల వరకు వేలంపాట వేయడం ద్వారా భూలోక పదవిని కైవసం చేసుకున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా వెల్లూరు పంచాయతీలో కూడా గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ద్వారా ఏకగ్రీవానికి జనసేన తెదేపా, వైకాపా పార్టీలను సయోధ్య కుదుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ చర్చలు ఏమాత్రం ఫలించలేదు. పంచాయతీలు ఉన్న అత్యధికమంది ధారపు గున్నా రెడ్డికి మద్దతు అందిస్తుండగా, తెదేపా వైకాపాకు చెందిన పెద్దలు 10 వార్డు సభ్యులు ఉన్న పంచాయతీలో ఆరు వార్డు మెంబర్లతో పాటు ఒక ఉపసర్పంచ్ కావాలంటూ పట్టు పడుతున్నారు. అయితే జనసేనకు చెందిన గున్నరెడ్డి మాత్రం ఉప సర్పంచ్ తో కూడిన 5 వార్డు సభ్యులు అంగీకారం తెలిపారు. దీనితోపాటు వేసవిలో జరగనున్న గ్రామ దేవత పండగకు అయ్యే ఖర్చును కూడా తానే భరించనున్నట్లు గుండారెడ్డి పార్టీల సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే చర్చలు అసంపూర్తిగా నిలవడంతో సమావేశం వాయిదాకు దారితీసింది. కొప్పర్లలో పంచాయితీకి తెదేపా జనసేన వైకాపా పెద్దలు పంచాయతీని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పార్టీల పెద్దల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే దారి తీయడంతో పోటీ అనివార్యంగా మారింది. ఇక్కడ జనసేన పైకాపాకు మద్దతు తెలపడంతో ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని కూడా నిర్ణయించి ముహూర్తాలు కూడా సన్నద్ధమయ్యారు. మిగిలిన పంచాయితీల్లో కొన్నిచోట్ల ఐదుగురు వరకు పంచాయతీ సర్పంచులకు పోటీ పడే ఎందుకో తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. మరి నామినేషన్లు వేసాక ఎవరు పదవులకు పోటీ చేస్తారో ఎంతమంది పదవుల పోటీ నుంచి ఉపసంహరించుకుంటారు వేచి చూడాల్సిందే మరి.