andhrapradesh
ధర్మపురిలో సందడే సందడి..
- సిరమ్మకు అభినందనల వెల్లువ....
విజయనగరం సూర్య: తెర్లాం జడ్పిటిసిగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సిరమ్మ కు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పోటెత్తడంతో విజయనగరం ధర్మపురిలోని 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్' సోమవారం కోలాహలంగా మారింది. అడుగడుగునా కార్యకర్తల సందడితో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె అయిన సిరమ్మ అఖండ విజయం సాధించడంపై పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు, అభిమానులు సిరమ్మ కు పూల బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తన విజయాన్ని ఆకాంక్షించి, స్వయంగా తరలివచ్చి అభినందించిన ప్రతి ఒక్కరికీ జడ్పిటిసి సిరమ్మ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.