సర్పంచ్ అభ్యర్థిగా స్టాలిన్ బాబు నామినేషన్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
తాడికోన గ్రామపంచాయితీ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా గోసంగి స్టాలిన్ బాబు సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.ఈ సందర్భంగా స్టాలిన్ బాబు
మాట్లాడుతూ తాడికోన గ్రామంలో మౌలిక వసతుల
కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,స్థానిక కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్దఎత్తున
తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.ప్రజలందరూ తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని
స్టాలిన్ బాబు కోరారు.