andhrapradesh
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి
తెనాలి, న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో దీప్తి అధికారులను ఆదేశించారు. తెనాలి మండలంలో రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నేపథ్యంలో కొలకలూరు, కటివరం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో దీప్తి ఆదేశించారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.