నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని సంత గేట్ సమీపంలో 30వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు సోమవారం సందర్శించారు.ఇందులో భాగంగా పేద ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.అన్న క్యాంటీన్‌లో అందుతున్న అల్పాహారం,సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ అన్నాక్యాంటీన్ నందు టిఫిన్,భోజనం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.నిరుపేదల ఫైవ్ స్టార్ హోటళ్లుగా ప్రసిద్ధిగాంచాయన్నారు.ఈ కార్యక్రమంలో 30వ వార్డు టీడీపీ ఇంచార్జ్ సల్మా తబసుమ్,షరీఫ్,యాలగిరి దొరస్వామి నాయుడు,టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ్,టౌన్ జనరల్ సెక్రటరీ రామాంజనేయులు,సీనియర్ నాయకులు ఎస్.ఏ.మస్తాన్,రేగడి ప్రసాద్ రాయల్,నాగరాణి,21వ వార్డు టీడీపీ ఇంచార్జ్ నాగూర్ వలి (షో ఆప్ శీనా),శ్రీరాములు,ఐటీడీపీ అధ్యక్షుడు కాశీ శ్రీరామ్ వాల్మీకి,మార్కెట్ యార్డు డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి,పసుపులేటి శ్రీనివాసులు,కేఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి