BREAKING
భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు

రెండోవిడత పల్లెపోరుకు రెడీ

Select Suryaa Now
రెండోవిడత పల్లెపోరుకు రెడీ
  • మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని..
  • పది మండలాల్లో పోరు
  • ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు
  • 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు

విజయనగరం బ్యూరో, సూర్య: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మళ్లీ మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పది మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

  • పది మండలాల్లో ఎన్నికల కోలాహలం
    రెండో విడతలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. బొబ్బిలి డివిజన్‌లో దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ మండలాలు, చీపురుపల్లి డివిజన్‌లో రేగిడి ఆమదాలవలస, వంగర, రాజాం, సంతకవిటి మండలాలు, విజయనగరం డివిజన్‌లో బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలు ఎన్నికల జాబితాలో ఉన్నాయి. ఆయా మండలాల్లో గ్రామ పంచాయతీలతో పాటు వార్డుల్లోనూ ఎన్నికల సందడి కనిపించనుంది.
  • 18 నుంచే నామినేషన్లు

ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 23న పరిష్కరిస్తారు.

  • 24న అభ్యర్థులపై స్పష్టత

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. దీంతో ఏ గ్రామంలో ఎంతమంది పోటీలో ఉన్నారు? ఎక్కడెక్కడ ముఖాముఖి పోరు ఉండనుంది? ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయా? అనే అంశాలపై స్పష్టత రానుంది.

  • 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు

ఈ నెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైన చోట్ల రీపోలింగ్ ఉంటే నవంబర్ 30న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

  • గ్రామాల్లో రాజకీయ సందడి

రెండో విడత నోటిఫికేషన్‌తో ఆయా పది మండలాల్లో స్థానిక రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. సర్పంచ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న రాజకీయ సమీకరణాలకు తోడు కొత్త అభ్యర్థుల రంగప్రవేశంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. మొత్తానికి రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పది మండలాల్లో పల్లె రాజకీయాలకు మళ్లీ తెరలేచింది.