బసవ సూర్యనారాయణకు రావాడ సీతారాం ఘన నివాళి
విజయనగరం, నవంబర్ 16, మేజర్ న్యూస్:
సీనియర్ దళిత నాయకులు, ప్రజా హక్కుల పోరాట యోధులు దివంగత బసవ సూర్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఘనంగా నివాళులర్పించారు. సోమవారం విజయనగరంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన బసవ సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా రావాడ సీతారాం మాట్లాడుతూ.. జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతి, దళితుల హక్కుల పరిరక్షణ కోసం బసవ సూర్యనారాయణ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సామాజిక న్యాయ సాధన కోసం, దళిత బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పటిష్ట అమలు, పేద ప్రజల హక్కుల పరిరక్షణ, దళిత గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. వివిధ ప్రజా ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడని రావాడ సీతారాం గుర్తుచేసుకున్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం