BREAKING
భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు

ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతుకూ సర్టిఫికేషన్ తప్పనిసరి -- కె. అమల కుమారి

Select Suryaa Now
ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతుకూ సర్టిఫికేషన్ తప్పనిసరి -- కె. అమల కుమారి
నరసరావుపేట  న్యూస్ :ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు తప్పనిసరిగా సర్టిఫికేషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని, రైతులందరి వివరాలను ధ్రువీకరణ ప్రక్రియలో నమోదు చేయాలని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమల కుమారి సూచించారు. సోమవారం నరసరావుపేటలోని బృందావన్ గార్డెన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ ఆధ్వర్యంలో రైతు సాధికార సంస్థ సిబ్బందికి సర్టిఫికేషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్లకు చెందిన 120 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్‌పీలు), బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ (బీఆర్‌సీ) యజమానులు, బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమల కుమారి మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతును సర్టిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. రైతుల పూర్తి వివరాలను సేకరించి ధ్రువీకరణ ప్రక్రియలో నమోదు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సైతం తమ వివరాలను నమోదు చేసుకుని సర్టిఫికేషన్ పొందేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో విశ్వసనీయత, ప్రత్యేక గుర్తింపు కల్పించడం లో సర్టిఫికేషన్ కీలకపాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ధ్రువీకరణ పొందిన రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించే సమయంలో మెరుగైన ధరలు పొందడంతో పాటు విస్తృత మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. నకిలీ, మోసపూరిత ఉత్పత్తులను గుర్తించడంతో పాటు నిజమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు సర్టిఫికేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్ రాజ్, మార్కెటింగ్ సిబ్బంది, ఎన్‌ఎఫ్‌ఏ మేరీ, మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్లు సుబ్బారెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.