BREAKING
మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆసియా మార్కెట్లకు దీటుగా భారత స్టాక్ మార్కెట్లు: 82 వేలకుపైన సెన్సెక్స్! గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆశా కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఎఐటియుసి ఉపాధ్యక్షురాలు  పి.ప్రేంపావని మాట్లాడుతూ రాష్ట్రంలోని 27వేల పై చిలుకు ఆశా కార్మికులకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ప్రతి వర్కర్‌కు కనీస వేతనం రూ.26వేలు ఉండాలని సిఫారసు చేసినా ప్రభుత్వాలు బేఖాతరు చేయటాన్ని తప్పు బట్టారు. పారితోషికం పేరిట ఆశాలకు రూ.9900లు ఇస్తూ ఆశా కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని తెలిపారు.  రిటైర్‌మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, విధి నిర్వాహణలో ఉండగా చనిపోయిన కార్మికురాలికి రూ. 50వేలు మట్టి ఖర్చులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.   వీరికి 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, పిఎఫ్, ఇయసఐ సౌకర్యాలను కల్పించాలని కోరుతూ  డిసెంబర్ 15వ తేదీ నుండి ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగుతారని ఆరోగ్య కమీషనర్కు వినతిపత్రం ఇచ్చినా నేటి వరకు వారి నుండి ఎలాంటి హామీ రాలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యÖనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు, జయలక్ష్మి, నగర ఆశా వర్కర్స్ యÖనియన్ అధ్యక్షురాలు మీనా, ఎఐటియుసి ఆశా వర్కర్స్ యÖనియన్ కన్వీనర్ కె.జ్యోతి, సిఐటియు నాయకులు దశరథ్, కుమార స్వామిలు, యాదయ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు