గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి
కారంచేడు, మేజర్‌న్యూస్ :
: ఈ నెల 26 న జరగనునున్న పంచాయతీ ఎన్నికల కు సంబంధించి పోలింగ్ & కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి.,పేర్కొన్నారు.
సోమవారం కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ మరియు కేశవర ప్పాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ & కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను మరియు స్వర్ణ పంచాయతీ కార్యాలయం లో స్వీకరిస్తున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు
ఈ నెల 15 నుంచి 17 వరకు సర్పంచ్ / వార్డు సభ్యుల కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరించాలన్నారు. ఈ నెల 26 న జరగనునున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ మరియు కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కేంద్రాల్లో అభ్యర్థులు అవసరమైన తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని,
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద మరియు పోలింగ్ & కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనలను పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ
నరసింహా రావు, తహశీల్దార్ మాధవిలత,యం పి డి ఓ.నేతాజీ, పంచాయతీ కార్యదర్శిలు,సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.