BREAKING
ఈ నెల 30న నగరంలో ఆటోల బందు గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు! అమెరికా అధ్యక్షుడి పర్యటనకు ముందే చైనా ప్రధాని కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు

పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

Select Suryaa Now
పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

బత్తలపల్లి మేజర్ న్యూస్:

స్థానిక పంచాయతీ ఎన్నికల సమరం వేడెక్కడంతో పోట్లమర్రి సర్పంచ్ స్థానానికి అభ్యర్థిగా నెట్టెం శకుంతలమ్మ సోమవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గంటాపురం గ్రామం నుండి, గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు.

గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగిన ఈ ర్యాలీలో వందలాదిగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పాల్గొన్నాయి. శకుంతలమ్మకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే గెలుపుపై ఆమె వర్గంలో ధీమా స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా నెట్టెం శకుంతలమ్మ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆశీస్సులతోనే తాను బరిలో నిలిచానని, పోట్లమర్రి సమಗ್ರ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించిన అనంతరం నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.