వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో ఎన్నికల పోరుకు సిద్ధం
- టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి (తుఫాన్‌రెడ్డి) సతీమణిగా మల్లేశ్వరి సర్పంచ్ బరిలో
పామూరు, మేజర్ న్యూస్ :
పామూరు మండలం వగ్గంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా బైరెడ్డి మల్లేశ్వరి నిలిచారు. గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (తుఫాన్‌రెడ్డి) సతీమణి అయిన మల్లేశ్వరి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబం నుంచి మల్లేశ్వరి ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నాయకత్వం ఆశీస్సులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో గ్రామ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం వంటి అంశాలతో ప్రజల ముందుకు వెళ్లాలని అభ్యర్థి వర్గం భావిస్తోంది. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లేశ్వరికి పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నారు.ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులు, భర్త వెంకటేశ్వరరెడ్డి గ్రామస్థాయిలో ఉన్న రాజకీయ పరిచయాలు ఆమెకు ఎన్నికల ప్రచారంలో బలంగా నిలవనున్నాయి.