BREAKING
ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను ఎన్విడియా ఫలితాలు, ఆంత్రోపిక్ ఐపీఓ ముందస్తు ప్రభావంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు ఐటీఓ ఘాట్ వద్ద ఉషా అర్ఘ్యం సమర్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా

విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి

Select Suryaa Now
విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా  --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి

పాలకొల్లు , మేజర్ న్యూస్ :అర్బన్ తుఫాన్ నేపథ్యంలో పాలకొల్లు పట్టణంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ సిబ్బందికి సహాయం చేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన పట్టణంలోని 10వ వార్డుకు చెందిన పలివెల కిషోర్ కుటుంబానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అండగా నిలిచారు. పాలకొల్లులోని. కార్యాలయం వద్ద  బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు.

యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటానని, ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయాన్ని అందేలా చూడటం తన బాధ్యతని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందేలా కృషి చేసి మంజూరు చేయించారు.

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా కింద మరో రూ.5 లక్షలు అందేలా మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ

ప్రమాదంలో యువకుడిని కోల్పోయిన కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదని అన్నారు. కుటుంబానికి కలిగిన తీరని లోటును పూడ్చలేకపోయినా, కష్టకాలంలో వారికి అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.