BREAKING
పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను ఎన్విడియా ఫలితాలు, ఆంత్రోపిక్ ఐపీఓ ముందస్తు ప్రభావంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు ఐటీఓ ఘాట్ వద్ద ఉషా అర్ఘ్యం సమర్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అమెరికా జాతీయ ఛాంపియన్‌లుగా ఎన్విడియా, ఇతర ఏఐ దిగ్గజాలు ఆసియా మార్కెట్లలో మారుతున్న గెలుపు ఓటముల సమీకరణాలు దివంగత నటి నిమ్మి ఆస్తుల కబ్జా వివాదం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

Select Suryaa Now
ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

కీసరగుట్టలో ఉసిరి, బిల్వం మొక్కలు నాటిన మాజీ మంత్రి

కీసర, మేజర్ న్యూస్ (నవంబర్, 16): పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన మొక్కలను పెంచడం ద్వారా ప్రకృతిని, సంప్రదాయాలను కాపాడుకోవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఇంటా ఉసిరి, ప్రతి గుడిలో బిల్వం మొక్కలు ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కార్తీక మాసం సందర్భంగా సోమవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉసిరి, ఏకబిల్వం మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ‘సరికొత్త హరిత సంకల్పం’తో ప్రతి ఇంటా ఉసిరి, ప్రతి ఆలయంలో బిల్వం మొక్కలు నాటాలనే ఆలోచన గొప్పదని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాయకపు మాధురి వెంకటేశ్‌, రాష్ట్ర కోఆర్డినేటర్‌ నూతికడి భోజనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆలయ చైర్మన్‌ తటాకం వెంకటేశ్‌శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి, భాను శర్మ, రమేశ్‌యాదవ్‌, గుర్రం శ్రీధర్‌రెడ్డి, మిట్టపల్లి అనిల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.