BREAKING
​రూ. 5 కోట్ల కోసం నకిలీ సీబీఐ అధికారుల అవతారంలో కిడ్నాప్.. 4 రోజుల్లోనే కేసును ఛేదించి, వ్యాపారిని రక్షించిన మదనపల్లె పోలీసులు డాలర్‌తో మారకంలో ఊగిసలాటలో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు కలకలం అమెరికా రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం చైనాలో మందగించిన ఆర్థిక వృద్ధి..రిటైల్ విక్రయాలు హైట్రీ కల్లోలం మధ్య హైతీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మాజీ ప్రథమ మహిళ కృత్రిమ మేధస్సు ఆయుధాలపై అంతర్జాతీయ చర్చలకు గండి ధనాపురం సర్పంచ్ రేసులో ఎ. మంగమ్మ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం.. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పోటీకి సిద్ధం! నేటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజుల పర్యటనసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష. ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ ఆడుకోవడానికి వెళ్లి.. అనంత లోకాలకు షాద్‌నగర్ విద్యార్థిని అవంతికకు రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో తృతీయ బహుమతి రామచంద్ర మజ్జికి రెడ్డి శాంతి సన్మానం

నేటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజుల పర్యటనసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష.

Select Suryaa Now
నేటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజుల పర్యటనసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష.

హుస్నాబాద్,: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి నుంచి (సోమవారం) మూడు రోజుల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాల పంపిణీ, నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

మంత్రి పర్యటన షెడ్యూల్..

ఉదయం 9 గంటలకు – సైదాపూర్..

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద అలింకో ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక శిబిరంలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాలను మంత్రి పంపిణీ చేయనున్నారు. అనంతరం సిద్దిపేటలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 1 గంటకు – ఎల్కతుర్తి..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని ఎస్ఎంఆర్ గార్డెన్స్‌లో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటలకు – అక్కన్నపేట..

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అనంతరం ఈ నెల 19న సిద్దిపేటలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సమీక్షించనున్నారు.మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.