ధనాపురం సర్పంచ్ రేసులో ఎ. మంగమ్మ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం.. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పోటీకి సిద్ధం!
పరిగి మండలం ధనాపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో ఎ. మంగమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు.ధనాపురం గ్రామంలో మొత్తం 1,437 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 715 మంది, మహిళలు 722 మంది ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసుకుంటూ ధనాపురాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలన్నది మంగమ్మ కుటుంబ ఆలోచనగా ఉంది.మంగమ్మ భర్త రామకృష్ణ జనసేన పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనతో పాటు కుటుంబం కూడా పార్టీ కోసం తమ వంతు కృషి చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రజాసేవ లక్ష్యంగా తన భార్య మంగమ్మను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు.గ్రామంలో చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు క్షేత్రస్థాయిలో అవగాహన కలిగి ఉన్న రామకృష్ణ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి గతంలోనూ తనవంతు ప్రయత్నాలు చేశారు. గ్రామంలోని ప్రతి వీధిలో అభివృద్ధి పనులు జరగాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.
ధనాపురం ప్రజలు ఒక అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని రామకృష్ణ తెలిపారు. యువతతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.