అగస్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట
కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివ క్షేత్రాలలో భక్తుల రద్దీ పెరిగింది. మొదటి సోమవారం కావడంతో అతి పురాతనమైన దేవాలయమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ స్వర్ణముఖి నది తీరంలో వెలసిన అగస్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువైంది. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మాంగల్యాలు బాగుండాలని కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలు జరిపి దీపారాధన చేశారు. ఆలయ నిర్వహకులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.