చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక
సీతానగరం సూర్య న్యూస్: సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామానికి చెందిన టిడిపి, జనసేన పార్టీల నాయకులు,కార్యక ర్తలు శనివారం రాత్రి వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వడ్లమూడి శ్రీనివాసరాజు, చేకూరి ముత్యం, చేకూరి సుబ్బ రాజు,నంబూరి బల రామకృష్ణం రాజు (బాల), యర్రంశెట్టి సతీష్, నంబూరి రంగరాజుతో పాటు మరో 20 మందికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా వారికి పార్టీ కండువాలు కప్పి సాద రంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రానున్న పంచాయ తీ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులంతా సమ న్వయంతో పనిచేయాలని గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయా లని పిలుపునిచ్చారు.