BREAKING
సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం... శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం...

Select Suryaa Now
రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం...

                                ఈ ఏడాది కొత్తపేట నియోజకవర్గ కమ్మ కార్తీక వన సమారాధన రద్దు...

ఆలమూరు మేజర్ న్యూస్ :ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే కొత్తపేట నియోజకవర్గ కాకతీయ కమ్మ మహాజన సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఈ ఏడాది విరామం ప్రకటించారు. ఇటీవల వరుసగా సంభవించిన తుఫాన్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈ ఏడాది వన సమారాధన నిర్వహించకూడదని కొత్తపేట నియోజకవర్గ కమ్మ సంఘం పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు జొన్నాడలో గొడవర్తి దుర్గాప్రసాద్ (బాబి) కార్యాలయం వద్ద కమ్మ సంఘం పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వారికి సంఘీభావంగా ఈ ఏడాది కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించకూడదని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం కమ్మ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించే ఈ వేడుకకు ఈసారి విరామం ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన పలువురు కమ్మ సంఘం పెద్దలు పాల్గొన్నారు.